E-PAPER

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి

గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో రాహుల్

తిరుమలాయపాలెం డిసెంబర్ 12 ( వై 7న్యూస్)

తిరుమలాయపాలెం మండల పరిధిలోని మహమ్మదాపురం సమీపంలో గల ఎస్టి బాలుర గురుకుల పాఠశాలశాలను ఐటీడీఏ పీవో రాహుల్ మరియు రీజనల్ కోఆర్డినేటర్ నాగార్జున . పాఠశాలను సందర్శించి వసతి సదుపాయాలు పరిశీలించారు. స్టోర్ రూమ్, కిచెన్, డైనింగ్ హాల్ తదితర వాటిని పరిశీలించారు. స్టోర్ రూమ్ లో నిల్వ ఉంచిన సన్నబియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, వంట నూనె, పప్పు దినుసులు, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారంగానే ఉన్నాయా? అని తనిఖీ చేశారు. సన్నబియ్యం నాణ్యతలో ఏమైనా తేడా ఉంటోందా అని మెస్ ఇంచార్జ్ లను ఆరా తీశారు. ఎలాంటి ఇబ్బందులు లేవని, నాణ్యమైన బియ్యం, ఇతర సరుకులు సరఫరా చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. భోజనం వండడానికి ముందే ప్రతి రోజు సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం తయారు చేసేలా చూడాలన్నారు. ఆహార పదార్థాలను స్టీల్ డబ్బాలలో భద్రపర్చి, వాటిపై తప్పనిసరిగా మూతలు భిగించాలని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, ఉదయం, సాయంత్రం సమయాలలో అల్పాహారం, స్నాక్స్ అందించాలని సూచించారు. రాత్రి సమయంలో ఏ.ఎన్.ఎం, వాచ్ మెన్ తో పాటు.. పర్యవేక్షణ కోసం ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా వసతి గృహంలోనే బస చేయాలన్నారు. నీటి సంపు, వాటర్ ట్యాంక్ లను పరిశీలించారు.
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకొచ్చేవారు కారని, ప్రస్తుతం గురుకుల పాఠశాలలో సీట్లు దొరికితే చాలని పోటీ పడుతున్నారన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. జనరల్‌ నాలెడ్జి, క్రీడలు వంటివాటిలో విద్యార్థులు రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్