తూప్రాన్ డిసెంబర్.6. వై సెవెన్ న్యూస్
విశ్వ మేధావి అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన మహానేత భారత రాజ్యాంగాన్ని ప్రాణం పోసిన ఆర్థికవేత్తుడు న్యాయ రాజా నీతిజ్ఞుడు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన మహా మేధావి భారతరత్న డా. బి. ఆర్ అంబేద్కర్ ఆ మహనీయునికి 68 వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్, అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు పసుల నర్సింగరావు, ఎస్ఐ శివానందం, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, మన్నె శ్రీనివాసరావు, కోరబోయిన ప్రవీణ్, కౌన్సిలర్ మామిడి వెంకటేశం, ఉమా సత్య లింగం, అనిల్, దొంతి రాజు, సర్గల నర్సింలు కుల సంఘ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Post Views: 240









