మాల మహానాడు రాష్ట్ర నాయకులు గుంతెటి వీరభద్రం
తిరుమలాయపాలెం డిసెంబర్ 6 (వై 7న్యూస్ )
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 68వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు గుంతేటీ వీరభద్రం అధ్యక్షత జరిగిన 68వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించటం జరిగింది. 68వ వర్ధంతి ఉత్సాహాన్ని పురస్కరించుకొని గుంతేటి వీరభద్రం మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అస్పృశ్యత అంటరానితనం నుండి యావ త్ భారతదేశం అంటరాని కులాలకు విముక్తి కల్పించిన మహాదాత బడికి గుడికి దూరం చేసిన సమాజంలో బడికి గుడికి దగ్గర చేసి లోనికి వెళ్లి చదువుకునే అవకాశం కల్పించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు రాజ్యాంగ హక్కుల రక్షణతో సమాజాన్ని కాపాడిన మహనీయుడు సామాజిక సమానత్వం కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ వ్యవస్థాపక పితామహుడిగా కీర్తి పొందిన మహనీయుడు అలాంటి మహానీయుడు కి నివాళులర్పించడం మన జాతికి గొప్ప గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సమాజంలో మనువాద రాజ్యాంగం ద్వారా అనిసివేయబడ్డ స్త్రీ జాతికి ఉద్యోగ భద్రత ప్రాణ రక్షణతో పాటు ప్రాథమిక హక్కులు కల్పించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు గౌరవ సలహాదారులు కొరివి దయానంద్ వరద నరసింహారావు జిల్లా అధ్యక్షుడు కొట్టే సుధాకర్ ప్రధాన కార్యదర్శి గుమ్మడి కనకరాజు పోస్టల్ ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణ కోశాధికారి ఎజ్జు ఏలియానారమల్ల వెంకన్న నగర వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం మల్లయ్యపాలపాటి మిన్ను మేడికొండ అంతోని ఎర్ర గంగాధర్ బిందే రమేష్ తలారి రాధాకృష్ణ నల్లపు రమేష్ పట్టేటి ఉదయ్ చింతపల్లి వెంకటేశ్వర్లు తోపాటు జిల్లా పట్టణ నాయకులు అందరూ పాల్గొన్నారు.









