E-PAPER

మాల జన సమితి ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

చిట్టి సురేష్ మల జనసమితి పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు

అశ్వాపురం నవంబర్ 28 వై సెవెన్ న్యూస్

బహుజనుల చైతన్య స్ఫూర్తి, కుల వివక్ష నిర్మూలన కోసం కృషి చేసిన మార్గదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి గురువారం మాల జన సమితి పినపాక నియోజకవర్గం అధ్యక్షుడు చిట్టి సురేష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి సాంఘిక సంస్కర్త సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహానీయుడు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి మరియు హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త ప్రధానంగా సమాజంలోని కులపరమైన వివక్షను అన్యాయాలను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరి నరసింహారావు, షేక్ షారుక్ భాష, లింగన్న, జరుపులా లక్ష్మణ్, కణతాల నరసింహ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News