E-PAPER

గురుకుల విద్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

కొత్తగూడెం,నవంబర్28 వై 7 న్యూస్

సుజాతనగర్ వేపలగడ్డలోని వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కలిగే ఇతర ఇబ్బందులను గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తాత్కాలిక భవనంలో గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేశామని పక్కా గృహం చేపట్టాలని కలెక్టర్ కు తెలుపగా వారం రోజుల్లో గురుకుల విద్యాలయానికి బిల్డింగ్ తోపాటు కావలసిన ఇతర సదుపాయాల ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం సుజాతనగర్ లోని జిన్నింగ్ మిల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పత్తిలో తేమశాతం,రేటు వంటి కొనుగోలు విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు సమకూరుస్తున్న వసతులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు, గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ బ్యూలారాణి, ఏవో నర్మద, రైతులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్