E-PAPER

దూసుకొస్తున్న తుఫాన్ ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

అమరావతి,నవంబర్ 26 వై 7 న్యూస్

ఏపీకి మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది 27కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానుందని అంచనా వేస్తున్నారు.

ఫలితంగా..ఇది తుఫాన్‌గా బలపడుతుందని భావిస్తున్నారు. ఫలితంగా రానున్న నాలుగైదు రోజుల్లో కోస్తాతో పాటుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో, అధికారులు అప్రమత్తం అయ్యారు.

పొంచి ఉన్న తుఫాన్

నేటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తోంది. దీంతో, ఈ నెల 25కల్లా దక్షిణ బంగాళా ఖాతం లో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది 27కల్లా తమిళనాడు, శ్రీలంక తీరాల దిశగా రానున్నదని వెల్లడించింది. ఇది తుఫాన్‌గా బల పడుతుందని అంచనా వేస్తున్నారు.

నాలుగు రోజులు వర్షాలు

తాజా అంచనాల మేరకు తీవ్ర అల్పపీడనం 26 వరకు పశ్చిమంగా పయనించి తరువాత బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉత్తర వాయవ్యంగా పయనించి 28 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. తరువాత తీవ్ర అల్పపీడనంగా మారుతూ 30న రాత్రి కోస్తాంధ్రలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తీవ్ర అల్పపీడనం 26దీకల్లా నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి, తరువాత వాయువ్యంగా పయనించి 28వ తేదీ రాత్రికి పుదుచ్చేరి వద్ద తీరం దాటుతుందని పేర్కొంది. తాజా అంచనాల మేరకు కోస్తాంధ్ర, రాయలసీమపై ఎక్కువ ప్రభావం ఉండనుంది.

కోస్తా జిల్లాలపై ప్రభావం

వాయుగుండంగా బలపడిన తరువాత 27 వరకు పశ్చిమ వాయువ్యంగా పయనించి, మయన్మార్‌ వైపు వెళ్లనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో నేటి నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో ఒకటి, రెండుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 27, 28 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో, 29న విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. అదే విధంగా 30న కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్