• తిరుమలాయపాలెం మండల వ్యవసాయ శాఖ అధికారి సీతారామరెడ్డి
తిరుమలాయపాలెం నవంబర్ 19 (వై 7న్యూస్ )
తిరుమలాయపాలెం మండల పరిధిలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ మిల్ ను మండల వ్యవసాయ శాఖ అధికారి సీతారామరెడ్డి ఆకస్మికంగా సందర్శించారు పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేపట్టాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సీతారామరెడ్డి సీసీఐ అధికారులకు, సూచించారు పత్తి పంటకు మద్దతు ధర క్వింటాల్కు రూ.7521 చొప్పున కొనుగోలు చేయాలని తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం పత్తి పంట తేమ 8 శాతం నుండి 12 శాతం వరకు ఉండాలని అధికారులు సూచించారు. పత్తి పంట రైతులు అమ్మటానికి తీసుకువచ్చిన వారికి నిబంధనల ప్రకారం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. అనంతరం పత్తి మిల్లును సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిసిఐ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.









