బాధితులకు తూప్రాన్ ఎస్.ఐ శివానందం సూచన.
తూప్రాన్ నవంబర్19 వై సెవెన్ న్యూస్
ఇటీవలి కాలంలో విలువైన మొబైల్ ఫోన్లను అజాగ్రత్త వల్ల పోగొట్టు కోవడమో, చోరికి గురి కావడమో లాంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధితులు వెంటనే అప్రమత్తమై మూడు విధాలుగా జాగ్రత్తలు పాటించినట్లయితే ఫోన్లు రికవరీ అయ్యే అవకాశాలున్నాయని తూప్రాన్ ఎస్.ఐ శివానందం సూచిస్తున్నారు. ఫోన్ పోగొట్టుకున్న బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి సీఈ ఐఆర్ అనే పోర్టల్ ను ఏర్పాటుచేసిందని తూప్రాన్ ఎస్.ఐ శివానందం తెలిపారు. మొదటి విధానంలో ఫోన్ పోయిన వెంటనే అదే నెంబరుపై కొత్త సిమ్ ను తీసుకొని సీఈఐఆర్ పోర్టల్ ను ఓపెన్ చేసి అందులో ఫోన్ నెంబర్ తో పాటు ఇతర వివరాలను అప్ లోడు చేసుకోవాలని, ఆ వెంటనే ఫోన్ ఎక్కడుందనే విషయాలు తెలుసుకోవడానికి ట్రాకింగ్ మొదలవుతుందని సూచించారు. రెండో విధానంలో సొంతంగా అప్ లోడ్ చేసుకోవడం రాకపోతే అందుబాటులో ఉన్న మీసేవ కేంద్రంలో సీఈ ఐ ఆర్ పోర్టల్ లో అప్ లోడ్ చేయించాలని, ఆ వివరాలు పోలీసులకు రెఫర్ చేస్తారని చెప్పారు. మూడో విధానంలో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చని ఎస్. ఐ సూచించారు. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న సందర్భాల్లో బాధితులు ఈ మూడు విధానాలను అనుసరిస్తే పోయిన విలువైన ఫోన్లు తిరిగి రికవరి కావడానికి విచారణ చేయడం సులువు అవుతుందని,పైగా కశ్చితంగా ఫోన్లు చేతికి అందే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.