E-PAPER

హెల్మెట్ తప్పనిసరి.. ప్రాణ రక్షణలో కీలక పాత్ర

పలాస ;

రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం తగ్గించడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని పోలీసులు తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా పోలీసులు ప్రత్యేకంగా “హెల్మెట్ బ్యాంక్” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వారికి ఉచితంగా శిరస్త్రాణాలు అందజేస్తూ, భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.
“మీ భద్రత – మీ చేతుల్లోనే ఉంది” అనే సందేశంతో జిల్లా పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ భవాని, సీఐ వై. రామకృష్ణ, తిరుపతి రావు, ఎస్ఐ సునీల్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News