E-PAPER

మణుగూరులో టపాసుల దుకాణాలను తనిఖీ చేసిన డీఎస్పీ

బాణసంచా విక్రయదారులు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను డీఎస్పీ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా దుకాణాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని దుకాణ యజమానులకు సూచించారు. బాణసంచా విక్రయాల సమయంలో అవసరమైన భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

దీపావళి వేడుకలు ప్రజలకు సంతోషాన్ని పంచేలా ఉండాలని, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీఎస్పీ సూచించారు.

ఈ తనిఖీల్లో మణుగూరు ఎస్‌హెచ్‌ఓ పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!