E-PAPER

అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై పోలీసులు కొరడా

• అక్రమంగా ఇసుక తరలిస్తున్న 12 వాహనాలు సీజ్ చేసిన, ఎస్ ఐ కూచిపూడి జగదీష్

తిరుమలాయపాలెం నవంబర్ 19 (వై 7 న్యూస్ )

తిరుమలాయపాలెం మండల పరిధి లోని ఇసుక ను అక్రమంగా రవాణా చేస్తున్న 12 ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో తన సిబ్బందితో కలిసి మండల పరిధిలోని కాకరవాయి శుద్ధవాగు తండా ముజాహితీపురం పడమటి తండా గ్రామాలలోని ఆకేరు వాగులు నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఇసుక బకాసురులపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై పేర్కొన్నారు. వ్యవసాయ పనుల కోసం సబ్సిడీలో తీసుకున్న ట్రాక్టర్ లు వ్యవసాయ పనులు మినహా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతూ పట్టుబడితే అ ట్రాక్టర్లు సీజ్ చేసి వాటియెక్క సబ్సిడీ రద్దు చేయుటకోసం సిపార్సు చేయడం జరుగుతుందన్నారు.
అక్రమ ఇసుక రవాణాపై తరచు ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరుగుతుదన్నారు. మండలంలొ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకొని,ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఇసుక రవాణానాకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సంబంధం ఉన్న వ్యక్తుల పై చర్యలు తప్పవని హెచ్చరించరు.ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్