E-PAPER

జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు గిరిజన గురుకుల విద్యార్థి

నసుల్లాబాద్ నవంబర్ 19 వై సెవెన్ న్యూస్ తెలుగు

నసుల్లాబాద్ మండలం ఈనెల 16 నుంచి 18 వరకు 68వ ఎస్ జి ఎఫ్ ఐ రాష్ట్రస్థాయి బేస్బాల్ క్రీడలు నిర్మల్ జిల్లా ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి. ఇట్టి పోటీలలో నసుల్లాబాద్ గిరిజన గురుకుల విద్యార్థి డి.రాహుల్ అత్యున్నత ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఈ పోటీలు డిసెంబర్ 2 నుంచి 6 వరకు న్యూఢిల్లీలో జరగనున్నాయి  తెలంగాణ జట్టు తరుపున ప్రాతినిధ్యం వహించనున్నారు ఇందుకుగాను కళాశాల ప్రిన్సిపాల్ ఈ మాధవరావు  , వైస్ ప్రిన్సిపాల్ రాహుల్ ,పోశెట్టి వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, అశ్విన్  ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్