బీర్కూరు నవంబర్ 19వై 7న్యూస్ తెలుగు
బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామస్తులు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా అందరూ కలిసి తమ గ్రామానికి ముఖ్య రహదారి అయినా ప్రకాష్ రావు క్యాంప్, మల్లాపూర్ గ్రామం వరకు రెండు కిలోమీటర్ల రోడ్డు పూర్తిగా ముళ్ళ పొదలు, చెట్లు ఆక్రమించుకోవడంతో ఆ గ్రామానికి వెళ్లడానికి ఇబ్బందిగా మారింది, ముఖ్యంగా వాహనాలు రావడానికి అతి కష్టంగా మారడంతో మాజీ జెడ్పిటిస సభ్యులు ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రమదానం చేపట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలు, రోడ్డుకు ఆక్రమించిన చెట్ల కొమ్మలను తొలగించి రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. 200 మంది మహిళలు పురుషులు, యువత శ్రమదానానికి నడుం బిగించారు. రెండు కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రహదారి పక్కన గల ముళ్ళ పొదలు, రోడ్లు ఆక్రమించుకున్న చెట్ల కొమ్మలను తొలగించారు. రోడ్ల భవనాల శాఖ అధికారులు చేయాల్సిన పనిని వారు పట్టించుకోకపోవడంతో ద్రోణవల్లి సతీష్ ముందుకు వచ్చి గ్రామస్తులతో కలిసి శ్రమదానానికి నడుం బిగించి రోడ్డు బాగుకు కృషి చేశారు. ఈ రహదారి వెంబడి రాత్రిపూట వెళ్లడానికి ఈ ముళ్ల పొదలు, చెట్ల కొమ్మలు అడ్డు రావడంతో వాటిని తొలగించారు.