బీసీ కుల గణనతోనే సాధికారత సాధ్యం
బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ సర్పంచ్
తూప్రాన్ నవంబర్19 వై సెవెన్ న్యూస్
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వేతో అందరికీ సమన్యాయం జరుగుతుందని చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న స్థానిక తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ దంపతుల తో పంచాయతీ సెక్రెటరీ రాధిక వివరాలు అడగగా సమగ్ర సర్వేలో పాల్గొని వివరాలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా బుడ్డ స్వర్ణలత భాగ్యరాజు మాట్లాడుతూ మంగళవారం ఉదయం చంధాయిపేట గ్రామంలో ఇంటింటి సమగ్ర సర్వే లో బాగంగా చేపట్టిన సర్వే ద్వార బీసీ కుల గణనతోనే సాధికారత సాధ్యం అయ్యి బీసీలకు రిజర్వేషన్లు అమలు, చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించేందుకు సరళీకృతం అవుతుందని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ లు న్యాయం చేయాలని పోరాటాలు చేసిన ఫలితం లేకుండా పోయింది అని అన్నారు. నేడు సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచి జరగబోతుంది.