మణుగూరు, అక్టోబర్ 2 వై 7 న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకల నేపథ్యంలో మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులర్పించిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. అనంతరం వారు మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు అని, యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత, సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాదిమంది భారతీయులకు స్వేచ్ఛ, స్వాతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధి అని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Post Views: 333









