ఆశ్వాపురం,అక్టోబర్ అశ్వాపురంలో02 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87 బ్యాచ్ పదోవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆధ్వర్యంలో జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.తొలుత గాంధీ విగ్రహానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ, సత్యాగ్రహామే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి, కొట్లాది భారతీయులకు స్వేచ్చా, స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మాగాంధీ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోస పాటి పిచ్చేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓరుగంటి రమేష్,మల్లాది శ్రీనివాసరావు, కొర్లకుంట రాంబాబు, కొర్లకుంట వెంకటేశ్వరావు, కోటేశ్వరి, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 517









