హైదరాబాద్,అక్టోబర్02 వై 7 న్యూస్;
పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ
ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
తెలంగాణ సాముహిక జీవన విధానానికి, కష్టసుఖాలను కలిసి పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనం అన్నారు.
ఎంగిలిపూల నుంచి సద్దుల వరకూ అందరూ కలిసి పండుగను జరుపుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని గౌరమ్మను మంత్రి సీతక్క ప్రార్థించారు.
Post Views: 158