నల్గొండ, సెప్టెంబర్ 13 వై 7 న్యూస్
అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ లో మృతిచెందిన సిపిఎం అఖిలభారత కార్యదర్శి సీతారాం ఏచూరి పార్టీవ దేహానికి ఢిల్లీలోని ఆయన నివాసంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తో పాటు సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి జోహార్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఆయన మరణం అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికే కాకుండా ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ మతోన్మాద విధానాలతో సమస్యలకు గురి అవుతున్న భారత ప్రజానీకానికి తీరని లోటని అన్నారు. కష్టజీవులు, కార్మికులు, కర్షకులు వ్యవసాయ కార్మికులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, మైనార్టీల సమస్యలపై నికరంగా నిలబడి పోరాడిన దీశాలి అని కొనియాడారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. వారి మృతికి సిపిఐఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ, నల్గొండ జిల్లా కమిటీ సంతాపం తెలియజేస్తుందని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని తెలియజేశారు. వారి ఆశయ సాధన కోసం యావత్ పార్టీ కృషి చేస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఏచూరి మరణం సిపిఎం పార్టీని పూర్తి దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలిపారు.









