E-PAPER

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టుకున్న సబ్ కలెక్టర్ కిరణ్మయి

బిచ్కుంద సెప్టెంబర్ 13 వై 7 న్యూస్

బిచ్కుంద మండలం అస్గుల్ గ్రామంలో అక్రమంగా మంజీరా నది నుంచి ఇసుకను తరలిస్తున్న 9 ట్రాక్టర్లను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆపి వే బిల్లులు తనిఖీ చేయగా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు తేలింది. ఈ విషయంలో సబ్ కలెక్టర్ అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే హైకోర్టు మంజీరా నది నుంచి ఇసుక తరలించకపోతే వారి వివరాలను తో పాటు అధికారులకు నోటీసులు జారీ అయ్యాయని. ఇది తెలిసి కూడా కొంతమంది అధికారులు, పోలీస్ శాఖలో పనిచేసే అధికారుల అండదండలతో ఇసుక తరలిపోతున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు.  పట్టుకున్న 9 ఇసుక ట్రాక్టర్లను బిచ్కుంద ఎస్సై కి అప్పగించారు. వీటిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.ఉదయం 9 ట్రాక్టర్లు పట్టుకుంటే రాత్రి 8 గంటల వరకు పట్టుకున్న స్థలంలో  ఉన్నాయి. పోలీసులు వాటి కాపలా కాస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News