ఎల్లారెడ్డి , ఆగస్టు 31 వై 7 న్యూస్ ;
సదాశివానగర్ మండలం లింగంపల్లి గ్రామం TSIIC ఇండస్ట్రియల్ జోన్ లో వివేక్ బయో ప్రొడక్ట్స్ కంపెనీ కి శంకుస్థాపన చేసిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ , కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ తాను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొట్టమొదటి ఇండస్ట్రీ ఏర్పాటు కానున్న సందర్భంగా ప్రజలకు అభినందనలు తెలిపారు. తాను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఇండస్ట్రీ తీసుకొచ్చి ఈ ప్రాంత యువతకు ఉద్యోగావకాశాలు కలిపిస్తాను అని ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు 2023 ఎన్నికలో ఇచ్చిన హామీ గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు లింగంపల్లి గ్రామం TSIIC ఇండస్ట్రియల్ జోన్ వివేక్ బయో ప్రొడక్ట్స్ ఆదివారం శంకుస్థాపన జరిగింది అని అన్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో నియోజకవర్గ నిరుద్యోగ యువతకు 250 ఉద్యోగావకాశాలు లభిస్తాయి అని తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విషయం ప్రజలకు గుర్తు చేశారు. నేటి వరకు ఎల్లారెడ్డి నియోజకవర్గ సుమారు 30 వేల రైతులకు 205 కొట్ల రుణమాఫీ జరిగింది అని తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో 300 కుటుంబాలకు వచ్చే 10 రోజుల్లో డబుల్ బెడ్రూం ఇల్లు అందిస్తాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎంపీ సురేష్ శెట్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.