. సబ్ కలెక్టర్ కిరణ్మయి పాఠశాల సందర్శన
బాన్సువాడ, ఆగస్టు 31 వై 7న్యూస్
విద్యాలయాలు మృత్యువుకు నిలయాలుగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను మొదలుకొని యూనివర్సిటీల వరకు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేక ఎవరన్నా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా? అన్న విషయాలను పోలీసులు బహిర్గతం చేయకపోవడంతో పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థులు మృత్యు వాత పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రశ్మిత శనివారం కళాశాలలోని బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన మర్చిపోకముందే బాన్సువాడ మైనార్టీ పాఠశాలలో అంజలి అనే 12 ఏళ్ల బాలిక జ్వరం బారిన పడి మృతి చెందింది . పాఠశాల యాజమాన్యం సక్రమంగా విద్యార్థుల పట్ల పర్యవేక్షణ లేకపోవడం చిన్నారులు కూడా ప్రాణాలు వదులుతున్నారు . కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి బాన్స్వాడలోని మైనార్టీ పాఠశాలలో 7వ తరగతి చదువుతుంది. శుక్రవారం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అంజలిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. వరుస ఘటనలు జరగడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.