E-PAPER

గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఐటీడీఏ పి ఓ

మణుగూరు ,ఆగస్టు31,వై 7 న్యూస్;

మణుగూరు మండలం తోగ్గూడెం లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలను ఐ,టి ,డి,ఏ భద్రాచలం పి,ఓ మరియు ఆర్, సి, ఓ లు ఆదివారం సందర్శించడం జరిగింది. పి,ఓ విద్యార్థులను గురించి ఉద్దేశిస్తూ మంచి భవిష్యత్తుకు ఇప్పటి నుంచే ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని నిర్దేశం చేశారు. అలాగే కళాశాలలో జరుగుతున్న స్టూడెంట్స్ కౌన్సిల్ ఎన్నికలను పరిశీలించారు.

విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని గురించి ఆర్, సి, ఓ విద్యార్థులను అడిగి తెలుసుకుని స్టోర్ లో ఉన్నటువంటి సరుకులను పరిశీలించి కాలం చెల్లిన సరుకుల విషయంలో జాగ్రత్త వహించాలని అలాగే కురకాయలను ఉప్పు నీటితో శుభ్రపరిచి వండాలని సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణను పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్