మణుగూరు, ఆగస్టు 14 ( వై 7 న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం గ్రామంలో సఖి మహిళా మండలి జాతీయ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ ఆదేశం మేరకు సఖి మహిళా మండలి కార్యాలయంలో బుధవారం మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూజారి జ్యోతి హాజరై కేకు కట్ చేసి మహిళా మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సీటైపులోని బాలల సదనంలో విద్యార్థులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పూజారి జ్యోతి మాట్లాడుతూ, సఖి మహిళా మండలి ప్రారంభించి నేటికీ సంవత్సరం పూర్తిఅయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా మహిళలు శిక్షణ, రుణాలు మరియు ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడానికి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారి గొంతును అందించడానికి, సామాజిక సేవలను బలోపేతం చేయడానికి మరియు మహిళల హక్కులపై అవగాహన పెంచడానికి త్వరలో సఖి మహిళా మండలి తరఫున అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత,వేములస్వరూప,
బత్తులసుజాత,వరలక్ష్మి ,లక్ష్మిభాయ్,స్వరూప,డెరంగల.సుజాత,దేవి,దుర్గాభవాని,లావణ్య, దీప్తి,మౌనికా. కారం.సుజాత,మంగా తదితరులు పాల్గొన్నారు.









