అమ్మవారికి నైవేద్యం సమర్పించిన భక్తులు
సిరిసంపదలతో తులతూగాలని వేడుకోలు
సాంప్రదాయా దుస్తుల్లో మహిళలు
తిరుమలాయపాలెం ఆగస్టు14
(వై 7న్యూస్)
ఆడపడుచుల బోనాలతో పిండిప్రోలు గ్రామం మురిసిపోయింది. ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక సంబంరం వెళ్లివిరిసింది.ముత్యాలమ్మ తల్లికి బోనం సమర్పించి భక్తజనం తరించిపోయారు. బోనం సమర్పించిన తమను చల్లగా చూడాలని, ఎలాంటి మహమ్మారి తమకు తగలకుండా కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. బుధవారం తిరుమలాయపాలెం మండల పరిధిలో పాపాయిగూడెం జల్లేపల్లి పాతర్లపాడు సుబ్లేడ్ బచ్చోడు కాకరవాయి పైనంపల్లి జూపెడ పిండిప్రోలు తదితర గ్రామాలలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు పిండిప్రోలు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలాజీ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ తల్లి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర తెలంగాణ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి తమ ఇండ్లలో నుంచి బోనాలను ఎత్తుకుని సంతోషంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా చిన్నారులు సైతం బోనాలు ఎత్తుకుని ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం లో గ్రామ గ్రామపంచాయతీ కార్యదర్శి బానోత్ బాలాజీ నాయక్ మాజీ ఎంపిటిసి పులుగుజ్జు వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ అంగడి వీరస్వామి సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు సొసైటీ డైరెక్టర్ చల్లా వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు పప్పుల ఉపేందర్ దొండేటి ఆనందరావు రామనబోయిన రవి కమ్మ కోమటి నాగేశ్వరరావు పులిగుజ్జు వెంకటస్వామి చామకూరి శ్రీనివాస్ దొడ్డ గురవయ్య పసలాది ముత్తయ్య పదముత్తు సంజీవరావు పప్పుల నరసింహారావు గోపోజి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు









