E-PAPER

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలో పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు

బాన్సువాడ,ఆగస్టు,12(వై7 న్యూస్);

బాన్సువాడ నియోజకవర్గం లోని బీర్కూరు మండలం కిష్టాపూర్ గ్రామంలోనీ ప్రాధమిక పాఠశాలలో రూ. 20 లక్షలతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులు, రూ. 9 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంభించి, గ్రామంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన పోచారం, బాలరాజు.ఈ కార్యక్రమాలలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు,గ్రామస్తులు.ఈసందర్భంగా
జరిగిన గ్రామ సభలో పోచారం గారు మాట్లాడుతూ తల్లిదండ్రులు జన్మనిస్తే, జ్ఞానాన్ని ఇచ్చే వారు గురువులు అని,విద్య తోనే మనిషికి అభివృద్ధి సాధ్యం అని అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించడానికి గత ఆరు ఏళ్ళలో రూ.50 కోట్లతో 350 నూతన భవనాలు, అదనపు తరగతి గదులు మంజూరు చేశానని తెలిపారు.రూ. 12 కోట్లతో 110 అంగన్వాడీ భవనాలు నిర్మించాం అని అన్నారు.

నేను 1994 మొదటిసారి శాసనసభ్యుడు అయినప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్కటే జూనియర్ కాలేజీ ఉండేదని ఇప్పుడు అన్ని కాలేజీలు కలిపి ముప్పై అయినవి అని తెలిపారు.మౌళిక సదుపాయాలు కల్పించడం నా బాధ్యత అని విద్య నేర్పించడం గురువుల బాధ్యత అని అన్నారు.ఈ అవకాశాలను ఉపయోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థితికి ఎదగాలి ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నిధులను కేటాయిస్తున్నారని అన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారని,
అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు, వైట్ రేషన్ కార్డుల మంజూరుపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ,డబుల్ బెడ్ రూం నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ బిల్లులు త్వరలోనే అందుతాయని,ఇళ్ళు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటిని మంజూరు చేస్తుందని,బాన్సువాడ నియోజకవర్గానికి మొదటి విడతలో 3500 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
ఈ పథకంలో ఒక్కో ఇంటికి అయిదు లక్షల రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో వేస్తారని,ప్రజాప్రతినిధులు, నాయకులు నిజాయితీగా ఉండి అర్హులైన పేదవారికి మాత్రమే ఇండ్లను కేటాయించాలాన్నారు..నిజాంసాగర్ ఆయకట్టులోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి ప్రధాన కాలువతో పాటుగా డిస్ట్రిబ్యూటర్ లకు కూడా లైనింగ్ చేయించానన్నారు.ఈ ఏడాది నిజాంసాగర్ ప్రాజెక్టులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి. అయినా ఎన్ని ప్రయత్నాలు చేసైనా వానాకాలం పంటలను బతికిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!