బూర్గంపాడు, ఆగస్టు 12 (వై7 న్యూస్);
బూర్గంపాడు మండలం PHC: M.P బంజర పరిధిలో గల RMP’s/PMP’s కు డా. M. లక్ష్మీసాయి ఆద్యక్షతన అవగహాన సదస్సు నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా DEMO Md. ఫియాజ్ ఉద్దీన్ పాల్గొని సీజనల్ వ్యాధుల దృష్ట్యా ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా, డెంగ్యు ప్రభలే అవకాశం ఉన్నందున తమ పరిధికి లోబడి, ఆర్హతకు మించి వైద్యం చేయరాదు, చిన్ని, చిన్న వ్యాధులకు ప్రధమ చికిత్స చేసి వెంటనే దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫరల్ చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలలో అబార్షన్ కానీ లింగ వివక్షతలు కానీ లింగ నిర్ధారణ పరీక్షలకు పంపడం చేయకూడదని తెలిపారు.ఏదైనా క్లిష్టమైన కేసులను మీదగ్గర ఉంచుకోకుండా రిఫరల్ చేయాలని సూచించారు.Rmp/PMP లందరూ వైద్యశాఖ అదికారులు సిబ్బందితో సమన్వయంతో అందరూ కలిసి పనిచేసుకొవాలని ఏదైనా మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కేసులు ఉన్నట్లయితే వెంటనే వైద్యాధికారి దృష్టికి తేవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సోమ్లా, జీతూ, రవి,RMP/Pmp ల మండల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొనీ పలు సూచనలు సలహాలు చేశారు.
