E-PAPER

ఆదివాసి బిడ్డగా నేను గర్వపడుతున్న;సీతక్క

వెనుకబడిన, పేదరికంలో వున్న ప్రజలకోసం కృషి చేస్తా;మంత్రి సీతక్క

పేదల కొరకు ప్రజల పక్షమై, పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆదివాసి అడవి బిడ్డ సమ్మక్క సారలమ్మల వారసురాలు మంత్రి సీతక్క HYD లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఆన్ ఆదివాసి ప్యాటర్న్స్ మీటింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీతక్క మాట్లాడుతూ… సమాజంలో అభివృద్ధి అనేది అన్ని వైపులా కాకుండా ఒకే వైపు జరుగుతుందని అన్నారు. కరోనా కష్టకాలంలో నేను వెళ్లిన ఆదివాసి ప్రాంతాలను చూసి కొంత మంది ఆశ్చర్య పడ్డారు. నా చిన్న తనం నుండి పోరాటాలు చేస్తూ పెరిగాను, సమస్యలను అధిగమించి ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. ఉద్యమాల ద్వారా ప్రజలను గౌరవించడం, సమస్యలను ప్రశ్నించడం నేర్చుకున్నానని తన నక్సలైట్ ఉద్యమ జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. అటవీ సంపద మీద ఆదివాసులకు నేటికి హక్కు లేకపోగా, అణచివేత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అడవిలోని సంపద మీద ఆధారపడే వారి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు. పేదరిక నిర్మూలన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News