E-PAPER

ఎస్టీ తెగలలో వర్గీకరణకు కమిషన్ నియమించాలి: ఆలెం కోటి

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలoలో తోగూడెం గ్రామంలో ఆదివాసి జండా ఆవిష్కరించి అక్కడి నుండి ర్యాలీగా హనుమాన్ టెంపుల్ వద్ద కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసుకొని తుడుం దెబ్బ జెండా ఆవిష్కరణ చేసి, కొబ్బరికాయలు కొట్టి ఆదివాసి అమరులకు నివాళులర్పించి, ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అక్కడినుండి ర్యాలీగా మణుగూరు మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి, డాక్టర్ “బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి పూలమాలవేసి, ఫ్రీడమ్ ఫైటర్ అల్లూరు సీతారామరాజు గారికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి, సందర్భంగా తుడుందెబ్బ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలను 2 44 అధికరణ కింద ఐదవ షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించడం జరిగింది.ఏజెన్సీ ప్రాంతాలలో 1/ 59 చట్టం 1/70 చట్టం; అసైన్మెంట్ 9/1977 చట్టం; పంచాయతీ రాజ్ చట్టం 1998, 2011 పీసా నిబంధనలు అమల్లోకి తీసుకురావడం జరిగింది.
ఐక్యరాజ్యసమితి 1994లో 26 మంది నిపుణులు వర్కింగ్ గ్రూప్ సమావేశమై ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరపాలని ప్రపంచ దేశాలకు పిలుపునివ్వడం జరిగింది.
మనదేశంలో 700 రకాల ఆదివాసి తెగలు ఉన్నవి 670 భాషలు మాట్లాడుతున్నారు వీరికి స్వయం నిర్ణయాలు ,హక్కు లు ఉండాలని స్వేచ్ఛగా జీవించాలని ,సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని, భాషను కాపాడుకోవాలని ,ఏజెన్సీలో అక్రమంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ,ఆదివాసులకు ఉండాలని వారి చట్టాలను కాలనీ అంతర్జాతీయంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ,విద్యా ,ఉద్యోగం , ఆ రోగ్యం ,భూమి, సంస్కృతి ,సాంప్రదాయాలు ,పర్యావరణం, హక్కులు ,చట్టాలు కాపాడి ఆదివాసీలను రక్షించాలని ఆగస్టు 9 న ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది.
10/01/2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ 3 ని ,తీసుకురావడం జరిగింది. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఐటీడీఏ పరిధిలోని 29 శాఖలలో 100% ఉద్యోగాలు కల్పన కోసం 29 జీవోలను తీసుకురావడం జరిగింది.
22/04/2020న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ జీఓ స్థానంలో కొత్త జీవో తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు..
నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 3 ,స్థానంలో కొత్త జీవో తీసుకురావాలని,
ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్ కోసం 12 మంది ఎమ్మెల్యేలు “ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్;
తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తున్నాం;
01/08/2024న,అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ ,ఎస్టీలు వర్గీకరణకు ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేయొచ్చని ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ST వర్గీకరణ చేయడం ద్వారా ఆదివాసులకు న్యాయం జరుగుతుంది.
ప్రభుత్వం వెంటనే ST తెగలలో వర్గీకరణ కోసం
కమిషన్ నియమించాలని; ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .అప్పుడు సామాజికంగా ఏజెన్సీ లో ఉన్న అన్ని తెగలకు న్యాయం జరుగుతుంది.
ఏజెన్సీ ప్రాంతంలో నాన్ షెడ్యూల్ గ్రామాలను షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలి.
ఐటీడీఏలో 29 శాఖలను పునరుద్ధరించాలి.
ఏజెన్సీలో 29 శాఖలకు 100% రిజర్వేషన్ కల్పించాలి ని,డిమాండ్ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తుడుందెబ్బ కార్యకర్తలు , నాయకులు
మండల అధ్యక్షుడు పడిగ నారాయణ, సుతారి వెంకన్న, మడకం శ్రీను, కొమరం సైదులు , కొమరం వెంకటేశ్వర్లు, కొమరం నిర్మల, మాజీ సర్పంచ్ భోగం రజిత, భోగం రాజు, ఇమ్మడి నాగేశ్వరావు, మడకం కుమారి, ఉకే మంగ, సక్కు భవాని, పోడియం మౌనిక, పోడియం రాజు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News