E-PAPER

సఖి జాతీయ మహిళా మండలి కార్యాలయం ప్రారంభించిన పూజారి జ్యోతి

మణుగూరు,ఆగస్టు07(వై 7న్యూస్);
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బస్ డిపో ఎదురుగా సఖీ జాతీయ మహిళా మండలి ప్రాంతీయ కార్యాలయం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సఖి జాతీయ సెక్రెటరీ పూజారి జ్యోతి హాజరయ్యారు. పూజారి జ్యోతి మాట్లాడుతూ, రోజువారీ జీవితంలో మహిళలపై గృహహింసలు పెరుగుతున్నాయని ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సఖీ వంటి క్లబ్‌ల అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని మహిళలకు అవగాహన కల్పించడంలో, వారికి తోడ్పాటు అందించడంలో సఖీ కీలకపాత్ర పోషించాలని సూచించారు.

మహిళల హక్కులు, లింగ సమానత్వం వారి కమ్యూనిటీలలో భద్రత గురించి అవగాహన పెంచే బాధ్యత సఖీ క్లబ్ సభ్యులపై ఉందని జ్యోతి అన్నారు.

మహిళలపై నేరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో వారి శ్రేయస్సును ప్రోత్సహించడంలో సఖీ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ హింసకు గురైన మహిళలకు సహాయక వ్యవస్థను అందించాలని, వారిని సంబంధిత అధికారులు , వనరులతో అనుసంధానించాలని తెలిపారు.మణుగూరు సఖి జాతీయ మహిళా మండలి ఆఫీసు ప్రారంభోత్సవంలో సోదరీమణులు డాన్సులతో, పాటలతో హోరెత్తించారు. డ్యాన్సులు పాటలతో ఆఫీసు ప్రారంభోత్సవం కమనీయ దృశ్య ఘట్టముగా మిగిలిపోయినది.
మణుగూరు సఖి జాతీయ మహిళా మండలి ఆఫీసు ప్రారంభోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన జిల్లా ప్రధాన కార్యదర్శి జీడిదేవి, జిల్లా ఉపాధ్యక్షురాలు తోట మంగా, మణుగూరు ఇన్చార్జ్ వేముల స్వరూప, జిల్లా సెక్రటరీ బత్తుల సుజాత, జాతీయ కార్యదర్శి పూజారి జ్యోతి, జిల్లా జాయింట్ సెక్రటరీలు లావణ్య, మౌనిక, గౌని లక్ష్మీబాయి, నేషనల్ డైరెక్టర్ ఇటికాల మాధవి, జిల్లా గౌరవ అధ్యక్షురాలు వరలక్ష్మి తదితర మహిళా సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో భద్రాచల మహిళా సోదరీమణులు దాసరి బేబీ, యాశం ఈశ్వరమ్మ, కుంజా రమాదేవి, సత్యవతి, సోడే రత్తమ్మ, రమణ, సమ్మక్క తదితర మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.కొత్తగూడెం నుండి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కలవ కొలను నాగలక్ష్మి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ నాగబత్తుల మంగాదేవి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ షాహిన్, జిల్లా జాయింట్ సెక్రెటరీ పూణేమ్ సీత తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News