తిరుమలాయపాలెం జూలై 29;మండల పరిధిలోని పాతర్లపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జడల శ్రీనివాస్ గౌడ్ గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతు జ్వరం తీవ్రత ఎక్కువై బ్రెయిన్ కు ఎక్కటం తో ఆదివారం రాత్రి ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గం మధ్యలో మృతి చెందారు జడల శ్రీనివాస్ మృతి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ జడల శ్రీనివాస్ భౌతికకాయానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియపరిచి మనోదైర్యం కల్పించి శ్రీనివాస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్ నాయక్ మిర్యాల విక్రం రెడ్డి ఎన్నమ్ సుధాకర్ రెడ్డి మండల యువజన కాంగ్రెస్ నాయకులు దూదిమెట్ల వెంకట్ జడల నగేష్ గౌడ్ షేక్ సైదా చీకటి శ్రీను జడల రమేష్ తదితరులు పాల్గొన్నారు









