E-PAPER

తెలంగాణ ప్రస్తుత గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్;తెలంగాణ ప్రస్తుత గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు.
ముందుగా ప్రస్తుత గవర్నర్‌ రాధాకృష్ణన్ ను శాలువాతో సన్మానించారు. అనంతరం కాసేపు ముచ్చటించారు. కాగా, తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు.మరి కొందరికి స్థానచలనం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్రమంత్రులు సైతం ఉన్నారు.
తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ ఈనెల 31న తెలంగాణకు రానున్నారు. ఈయన బీజేపీ సీనియర్ నాయకుడు. సొంత రాష్ట్రం త్రిపుర. రెండుసార్లు మంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా చేశారు.ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు…

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News