E-PAPER

ఏఎస్పీ ని కలిసిన దళిత సంఘ నాయకులు

నిర్మల్ ;నిర్మల్ జిల్లా భైంసా ఎస్డిపిఓ ఐపిఎస్ అవినాష్ కుమార్ ని కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించిన దళిత సంఘాల నాయకులు. అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ….ముదోల్ నియోజకవర్గంలో దళితులపైన జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలని న్యాయం కోసం ఏ ఎస్ పి కి మెమోరాండం ఇచ్చామన్నారు .నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో తదుపరి కార్యాచరణ చేపట్టి త్వరగా చార్జ్ షీట్ వేసి దోషులకు కఠిన శిక్ష పడేలా బాధితులకు న్యాయం జరిగేలా న్యాయం చేయాలని ఏఎస్పీ కి విన్నవించారు. ముధోల్ నియోజకవర్గం లో పలు గ్రామాల నుండి దళితులు పెద్ద సంఖ్యలో వచ్చి ఏఎస్పీ ని కలిసి వారి యొక్క సమస్యలు వివరించారు.
ఏ ఎస్ పి త్వరగా న్యాయం జరిగేలా చూస్తానని వారికి తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News