E-PAPER

కుబీర్ డోడర్నా ఆశ్రమ పాఠశాలను సందర్శించిన సిపిఐఎం జిల్లా నాయకులు

నిర్మల్; కుబిరు మండలంలోని డోడర్నాతండాలో గల ఆశ్రమ పాఠశాలను సిపిఎం పార్టీ నాయకులు సందర్శించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు సరిపోయే తరగతి గదులు లేవని వాటిని వెంటనే నిర్మించాలని ,మరుగుదొడ్లు రూమ్స్ అదనంగా నిర్మించాలని విద్యార్థులు పడుకోవడానికి సరైన రూమ్స్ లేక ఇబ్బంది పడుతున్నారని, అదనంగా గదులు నిర్మించాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.హాస్టల్ సందర్శించిన వారిలో సిపిఐ ఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దుర్గం నూతన్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు డాకూర్ తిరుపతి కుబీర్ మండల కార్యదర్శి జాదవ్ రమేష్ లో పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News