అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత.. చైతూతో తన వివాహం, వైవాహిక జీవితం, పెళ్లి తర్వాత ఎదురైన సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పెళ్లయిన వెంటనే తనకు తమిళనాడులో సినిమా షూటింగ్ ప్రారంభమైందని శోభిత తెలిపింది. దీంతో పెళ్లైన కొత్తలోనే తాను, చైతన్య వేర్వేరు ప్రాజెక్టుల కారణంగా నెలకు ఒక్కసారి మాత్రమే కలుసుకునేవాళ్లమని చెప్పుకొచ్చింది. ఇద్దరూ సినీ రంగంలోనే ఉండటంతో షూటింగ్స్, ఇతర పనుల కారణంగా ఒకే సమయంలో కలిసి ఉండటం కష్టంగా మారిందని వివరించింది.
వైవాహిక జీవితాన్ని, కెరీర్‌ను ఒకేసారి బ్యాలెన్స్ చేయడం మొదట్లో చాలా కష్టంగా అనిపించిందని శోభిత చెప్పింది. అయితే ఒకరి కెరీర్‌ను మరొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆమె వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలపై ఫోకస్ పెంచిన శోభిత.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మరింత జోరుగా కొనసాగిస్తోంది.









