ఫీచర్ ఫోన్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న HMD మరో కొత్త నోకియా ఫోన్‌ను విడుదల చేసింది. Nokia 300 Charge పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో భారీ బ్యాటరీ, దృఢమైన డిజైన్, రివర్స్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించారు. ముఖ్యంగా సాధారణ ఫీచర్ ఫోన్లలో కనిపించే బ్యాటరీలతో పోలిస్తే ఇందులో ఏకంగా 3,700mAh బ్యాటరీ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎక్కువ కాలం ఛార్జింగ్ అవసరం లేకుండా ఫోన్‌ను ఉపయోగించుకునేలా దీనిని రూపొందించారు.
Nokia 300 Chargeలో మరో ఆసక్తికరమైన ఫీచర్ 10W రివర్స్ ఛార్జింగ్. అంటే ఈ ఫోన్‌ను అవసరమైన సమయంలో పవర్ బ్యాంక్‌లా ఉపయోగించి ఇతర డివైజ్‌లకు ఛార్జింగ్ అందించవచ్చు. సాధారణ కాల్స్, మెసేజ్‌లతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇతర ఫోన్లకు బ్యాకప్ పవర్ అందించేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడనుంది. భారీ బ్యాటరీ కారణంగా ఫోన్ బరువు, డిజైన్ విషయంలోనూ దృఢత్వానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూసుకుంటే.. స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల కంటే బ్యాటరీ బ్యాకప్, మన్నిక, సింపుల్ యూజ్ కోరుకునే వారికి Nokia 300 Charge ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలవనుంది. ముఖ్యంగా ఎక్కువ రోజులు ఛార్జర్‌కు దూరంగా ఉండాల్సిన వారు, అత్యవసర సమయంలో ఇతర ఫోన్లకు ఛార్జింగ్ ఇవ్వాలనుకునే వారికి రివర్స్ ఛార్జింగ్ ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్ ఫోన్ ధర, భారత్‌లో లభ్యతకు సంబంధించిన వివరాలను HMD వెల్లడించాల్సి ఉంది.









