E-PAPER

WhatsApp Security: వాట్సాప్‌లో అదిరిపోయే సెక్యూరిటీ అప్‌డేట్స్.. ఇక పాస్‌కీలు, కాల్స్‌పై మరింత రక్షణ!

వాట్సాప్ యూజర్ల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు మెటా కీలకమైన సెక్యూరిటీ ఫీచర్లను ప్రకటించింది. ఇప్పటికే పాస్‌కీ ఫీచర్‌ను ఉపయోగిస్తున్న యూజర్ల సంఖ్య 100 కోట్లకు చేరుకున్నట్లు మెటా వెల్లడించింది. దీంతో పాస్‌వర్డ్‌లకు ప్రత్యామ్నాయంగా పాస్‌కీల వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. పాస్‌కీ ద్వారా ఫింగర్‌ప్రింట్, ఫేస్ అన్‌లాక్ లేదా డివైజ్ స్క్రీన్ లాక్ వంటి సురక్షిత పద్ధతులతో వాట్సాప్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవచ్చు.

ఇక ఒకే వాట్సాప్ అకౌంట్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో ఉపయోగించే వారికి మరింత సౌకర్యం కల్పించింది. ఇకపై ఒకటి కంటే ఎక్కువ పాస్‌కీలను యాడ్ చేసుకునే అవకాశం అందిస్తోంది. దీంతో వేర్వేరు డివైజ్‌లలో అకౌంట్‌ను ఉపయోగించే సమయంలో సెక్యూరిటీ పరంగా మరింత ఫ్లెక్సిబిలిటీ లభించనుంది. అలాగే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA)లో కొత్త పాస్‌వర్డ్ ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చింది.

మరోవైపు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలోనూ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందిస్తోంది. కాల్ స్క్రీనింగ్ ఫీచర్ ద్వారా గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు అదనపు సమాచారాన్ని అందించే అవకాశం ఉంటుంది. దీంతో స్పామ్ లేదా అనుమానాస్పద కాల్స్ విషయంలో యూజర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చు. మొత్తంగా ఈ కొత్త ఫీచర్లతో వాట్సాప్ అకౌంట్లకు సెక్యూరిటీ మరింత బలోపేతం కానుంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!