మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’పై రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఇటీవల చేతికి గాయం కావడంతో ఎన్టీఆర్ సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తారక్ పూర్తిగా కోలుకునే వరకు షూటింగ్‌ను ఆపకుండా, ఆయన అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సెప్టెంబర్ రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
ఈ షెడ్యూల్లో ఇతర నటీనటుల కాంబినేషన్ సీన్స్‌తో పాటు కీలకమైన టాకీ పార్ట్స్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. మరోవైపు ‘డ్రాగన్’లో ప్రశాంత్ నీల్ తన రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌కు భిన్నంగా కనిపించనున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగా డార్క్ టోన్స్, బ్లాక్ అండ్ గ్రే షేడ్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే నీల్.. ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌ను మాత్రం ఫుల్ కలర్ఫుల్గా, రిచ్ విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో డార్క్ షేడ్స్‌కు భిన్నంగా సరికొత్త కలర్ ప్యాలెట్‌ను ఉపయోగిస్తున్నారనే వార్త నిజమైతే.. ప్రేక్షకులకు కొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ దక్కే అవకాశం ఉంది. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ కావడంతో ‘డ్రాగన్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.









