ఇండోనేషియాలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం ఉదయం 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తర సుమత్రా ప్రాంతంలో 6.8 తీవ్రతతో మరో భారీ భూకంపం సంభవించింది. దీంతో వరుస ప్రకంపనలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం.. తాజా భూకంపం 158 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం కారణంగా ఉత్తర సుమత్రా పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.
ఒకే రోజు భారీ తీవ్రతతో వరుస భూకంపాలు సంభవించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందనే వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Post Views: 6









