కూనవరం, (వై7 న్యూస్ తెలుగు) ఆగస్టు 16: పోలవరం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నోముల వెంకట రామారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు పీ వి న్ మాధవ్ కి , మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్ కి స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జి రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నా ఎంపికకు సహకరించిన జోనల్ ఇన్చార్జ్ మట్ట ప్రసాద్ ,రాష్ట్ర సెక్రటరీ ఈ స్వప్న కుమారి లకు జిల్లా అధ్యక్షులు ఇక బుల్లి కొండల దొర కి సీనియర్ నాయకులు నామాల శ్రీనివాసరావు కి, జిల్లా ఇంచార్జ్ గాదే శ్రీనివాస్ రావు కి , గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాయం వెంకయ్య కి, రాష్ట్ర జిల్లా మండల శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పూర్తి బాధ్యత వహించి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని. పార్టీ నాయకులు, కార్యకర్తల అందరి సహకారంతో మరియు సమన్వయంతో పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.








