
పలాస–కాశీబుగ్గ పురపాలక సంఘ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాలాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా తమకు కేటాయించిన విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపల్ సిబ్బందికి ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే మున్సిపల్ సిబ్బంది కోసం నిర్వహించిన క్రికెట్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో మరింత నిబద్ధతతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే గౌతు శిరీష పిలుపునిచ్చారు.

Post Views: 15








