శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్:
79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రజా సేవల్లో ఆయన చూపిన ప్రతిభ, విధి నిర్వహణలో కృషిని గుర్తిస్తూ ఈ సత్కారం అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది కమిషనర్ శ్రీనివాసులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రశంసా పత్రం అందుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు.
Post Views: 27








