E-PAPER

Palak Paratha: పాలకూర అంటే ఇష్టం లేనివారికి ఇలా పరోటా చేసి పెట్టండి.. రుచి అదిరిపోతుంది!

ఆకుకూరల్లో పాలకూరకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో ఐరన్, విటమిన్‌-ఏ, విటమిన్‌-సి, ఫైబర్‌ వంటి పలు పోషకాలు ఉంటాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా తినేందుకు పిల్లలతో పాటు కొంతమంది పెద్దలు కూడా ఆసక్తి చూపించరు. అలాంటి వారికి పాలకూరతో రుచికరమైన పాలక్ పరోటా తయారు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది.

వెల్లుల్లి, పచ్చిమిర్చి, వేయించిన జీలకర్ర, మసాలాల రుచితో తయారయ్యే ఈ పరోటా ఎంతో రుచిగా ఉంటుంది. బయటివైపు క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండేలా తయారు చేసుకోవచ్చు. పెరుగు, పచ్చడి లేదా మీకు నచ్చిన కర్రీతో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది.

తయారీ విధానం: ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి కొద్దిసేపు వేడి నీటిలో ఉంచి, అనంతరం చల్లటి నీటిలో వేసి తీసుకోవాలి. పాలకూరను వెల్లుల్లి, పచ్చిమిర్చితో కలిపి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో పాలకూర పేస్ట్‌, వేయించిన జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఉప్పు వేసి అవసరమైనంత నీటితో మెత్తగా పిండిని కలుపుకోవాలి. కొద్దిసేపు నానబెట్టిన తర్వాత పరోటాలుగా వత్తుకుని పెనంపై రెండు వైపులా నెయ్యి లేదా నూనె వేసి క్రిస్పీగా కాల్చుకుంటే రుచికరమైన పాలక్ పరోటా సిద్ధం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!