ఆన్‌లైన్ మోర్ట్‌గేజ్ సంస్థ Better.comకు చెందిన సుమారు 900 మంది ఉద్యోగులను ఒకే జూమ్ కాల్‌లో తొలగించిన ఘటన 2021లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం తీసుకున్న భారత సంతతి CEO విశాల్ గార్గ్ అప్పట్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
అయితే ఇప్పుడు అదే విశాల్ గార్గ్ మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన ఆయననే తాజాగా సంస్థ CEO పదవి నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో తనను తిరిగి CEOగా నియమించాలని సంస్థ బోర్డును ఆయన కోరుతున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల తొలగింపు సమయంలో విశాల్ గార్గ్ వ్యవహరించిన తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆయననే CEO పదవి నుంచి తొలగించడంతో ఈ పరిణామం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనను తిరిగి బాధ్యతల్లోకి తీసుకోవాలని బోర్డును కోరడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Post Views: 8








