శ్రీకాకుళం జిల్లా పలాస వై 7 న్యూస్
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సీఐగా విధులు నిర్వహిస్తున్న గంధం రామకృష్ణకు ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు గంధం రామకృష్ణను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
“విధి నిర్వహణలో ప్రతిభకు గుర్తింపే ఈ పురస్కారం” అంటూ సహచరులు హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 28








