E-PAPER

ఒక్క నిమిషంలో 12 హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్.. ఆస్ట్రియా యువతి గిన్నిస్ రికార్డు!

పుష్‌అప్స్‌ చేయడమే చాలామందికి కష్టంగా ఉంటుంది. అలాంటిది చేతులపై నిలబడి హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్‌ చేయాలంటే ఎంతో శారీరక సామర్థ్యం, పట్టుదల అవసరం. అందులోనూ ముక్కు నేలకు తాకేలా పుష్‌అప్స్‌ చేయడం అంటే మరింత కఠినమైన సవాల్. ఆస్ట్రియాకు చెందిన స్టెఫానీ మిల్లింగర్ ఈ అసాధారణ ఫీట్‌తో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు.

స్టెఫానీ మిల్లింగర్ ఒక్క నిమిషంలో అత్యధిక నోస్-టు-గ్రౌండ్ హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్ చేసిన మహిళగా రికార్డు సాధించారు. కేవలం 60 సెకన్ల వ్యవధిలో ఏకంగా 12 హ్యాండ్‌స్టాండ్ పుష్‌అప్స్ పూర్తి చేసి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ ఫీట్‌ కోసం ఆమె చూపించిన బ్యాలెన్స్, బలం, వేగం అందరినీ ఆశ్చర్యపరిచాయి. కఠినమైన సాధనతో అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని సాధించిన స్టెఫానీ.. తన అద్భుత ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!