E-PAPER

2019 తర్వాత పరిస్థితులు మారాయి.. పీఓకే ప్రజలపై ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు మారకపోయి ఉంటే, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు కూడా భారత్‌లో తిరిగి కలవాలని కోరుతూ నేడు వీధుల్లో నిరసనలు చేపట్టేవారని ఆయన అన్నారు. శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజలు చేపట్టిన నిరసనలను ప్రస్తావించిన ఒమర్ అబ్దుల్లా.. ఆ ఆందోళనల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం, పలువురు అరెస్టు కావడం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. ప్రజల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లో 2019 తర్వాత చోటుచేసుకున్న మార్పులను ప్రస్తావిస్తూ ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో నెలకొన్న పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!