80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని విధాన భవన్‌లో భారీ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కళాకారులు, విద్యార్థులతో ముచ్చటించారు. కార్యక్రమంలో కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు కళాకారులు సీఎం యోగి చేపట్టిన బుల్డోజర్ చర్యలను ప్రస్తావిస్తూ ప్రశంసించారు. దీనిపై యోగి ఆదిత్యనాథ్ సరదాగా స్పందించారు. “నేను మీలాగా పాడలేను.. అందుకే చెడ్డవారిపై బుల్డోజర్లను ఉపయోగిస్తాను” అంటూ హాస్యభరితంగా వ్యాఖ్యానించారు.
యోగి చేసిన ఈ సరదా వ్యాఖ్యలతో కార్యక్రమంలో నవ్వులు పూశాయి. అక్కడున్న కళాకారులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు నవ్వుతూ స్పందించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.
Post Views: 6









