మెగా బ్రదర్ నాగబాబు తన మనవడు, హీరో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కుమారుడు వాయువ్ తేజ్ కొణిదెల ఫొటోను తొలిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నాగబాబు షేర్ చేసిన ఫొటోలో చిన్నారి వాయువ్ తేజ్.. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉన్న ఫొటోను ఆసక్తిగా చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ క్యూట్ మూమెంట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ ఫొటోతో పాటు నాగబాబు పెట్టిన క్యాప్షన్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. “మా బుజ్జిబాబు చరిత్రను తదేకంగా చూస్తున్నాడు. ఆ కళ్లలో చెప్పని కథలు ప్రతిబింబిస్తున్నాయి. తన అద్భుతమైన పరిశీలనతో మెగా వారసత్వం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది” అంటూ ఆయన రాసుకొచ్చారు. దీంతో మెగా అభిమానులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
Post Views: 7









