చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ విడుదలైంది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాటను ఘనంగా రిలీజ్ చేశారు.
అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్‌లపై కలర్ఫుల్గా చిత్రీకరించిన ఈ ఎనర్జిటిక్ పార్టీ సాంగ్ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) కలిసి స్వరపరిచిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ క్యాచీ లిరిక్స్ అందించారు. ప్రముఖ గాయకుడు బెన్నీ దయాల్ తన హై-వోల్టేజ్ వాయిస్‌తో పాటకు మరింత జోష్ తీసుకొచ్చారు.
పాట తనకు ఎంతో నచ్చిందని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ‘బా బా బ్లాక్ షీప్’ మంచి విజయం సాధించాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.









