చింతూరు, (వై7న్యూస్ తెలుగు ) ఆగస్టు 15: చింతూరు ఐటిడిఏ కార్యాలయంలో శ్రీ శుభం నోఖ్వాల్, ఐ.ఏ.యస్., ప్రాజెక్టు అధికారి ఆధ్వర్యంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసు శాఖ గౌరవ వందనం, గిరిజన ఆశ్రమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఎన్ సీ సీ విద్యార్థులు క్రమశిక్షణతో కవాతు నిర్వహించారు. జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు ప్రాజెక్టు అధికారి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వందేమాతరం గీతం ఆలపించి, జాతీయ జెండాను ఎగురవేసి, జనగణమన గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి శ్రీ శుభం నోఖ్వాల్, ఐ.ఏ.యస్. మాట్లాడుతూ, ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత దేశ భవిష్యత్తు అభివృద్ధిపై దృష్టి సారించి, దేశ నిర్మాణంలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత ఉద్యోగాలు సాధించి సమాజానికి, దేశానికి సేవ చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా కలెక్టర్, పోలవరం జిల్లా, రంపచోడవరం వారి ఆదేశాల మేరకు నశా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా “10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ ” నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మరియు విద్యార్థులతో వ్యసనాలకు దూరంగా ఉండేలా ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సమాజాన్ని మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు కృషి చేయాలని ప్రాజెక్టు అధికారి సూచించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ బి. హేమంత్, ఏ.ఎస్.పి., చింతూరు డివిజన్, శ్రీమతి Ch. రామ తులసి, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (TW), ఐ.టి.డి.ఏ., చింతూరు, వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, APTWR పాఠశాల NCC విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.









